Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన నిరుద్యోగ రేటు

Unemployment

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా.. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిన‌డం నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయి ఆందోళ‌న‌కు గురిచేసింది.. కానీ, ఇప్పుడు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. క్ర‌మంగా రాష్ట్రాలు లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి.. స‌డ‌లింపుల‌తో మ‌ళ్లీ క్ర‌మంగా అన్ని ప‌నులు ప్రారంభం అవుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. భార‌త్‌లో నిరుద్యోగ రేటు 6 వారాల క‌నిష్ట స్థాయికి ప‌డిపోయింది.. సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) పేర్కొన్న ప్ర‌కారం.. మేలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 14.7 శాతానికి ఎగ‌బాక‌గా.. గ్రామీణ భారతంలో 10.63 శాతంగా న‌మ‌దైంది.. అయితే, ఈ నెల 13వ తేదీ నాటికి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 9.7 శాతానికి త‌గ్గ‌గా.. గ్రామీణ నిరుద్యోగం 8.2 శాతానికి ప‌డిపోయింద‌ని సీఎంఐఈ పేర్కొంది.. మ‌రోవైపు.. క‌రోనా తొలినాల్ల‌లో అంటే.. గ‌త ఏడాది దేశ నిరుద్యోగ రేటు 23.52 శాతంగా న‌మోదైన విష‌యం తెలిసిందే.

Exit mobile version