Site icon NTV Telugu

Twitter: పడిపోతున్న ట్విట్టర్ వాల్యూ.. కొనుగోలు చేసిన దానితో పోలిస్తే దిగజారిన విలువ

Twitter

Twitter

Twitter: ప్రముఖ సోష్ల మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను భారీ ధరతో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా మస్క్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ కొన్న ధరకు కూడా పలకడం లేదు. ఏకంగా మూడింటి ఒక వంతు (1/3)కు పడిపోయింది. ట్విట్టర్ ఇన్వెస్టర్ ఫిడిలిటీ ప్రకారం.. ట్విట్టర్ వాల్యూ పడిపోయినట్లు తెలిపింది. ఫిడిలిటీ గతేడాది నవంబర్ లో ట్విట్టర్ వాటా విలువను కొనుగోలు ధరలో 44 శాతానికి తగ్గించింది.

Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..

మస్క్ బాధ్యతుల చేపట్టిన నుంచి ట్విట్టర్ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. వచ్చీ రాగానే సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయగద్దెలతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని తొలగించి సోలో డైరెక్టర్ గా మస్క్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కంపెనీ తిరోగమనం ప్రారంభం అయింది. దీనికితోడు 50 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం కూడా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. కంపెనీకి 13 బిలియన్ డాలర్లు అప్పు ఉంది.

మస్క్ యొక్క అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మరియు కంటెంట్ నియంత్రణతో సవాళ్ల కారణంగా ప్రకటనల ఆదాయం 50 శాతం తగ్గిందని మార్చిలో మస్క్ చెప్పారు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లను విక్రయించడం ద్వారా ఆ ఆదాయాన్ని తిరిగి పొందే ప్రయత్నం ఇప్పటివరకు విఫలమైంది. మార్చి చివరి నాటికి ట్విట్టర్ నెలవారీ వినియోగదారుల్లో 1 శాతం కంటే తక్కువ మంది సైన్ ఆఫ్ చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ట్విట్టర్‌లో మస్క్ పెట్టుబడి ఇప్పుడు 8.8 బిలియన్ డాలర్లు. ఇది అతని హోల్డింగ్ విలువను లెక్కించడానికి ఫిడిలిటీ యొక్క వాల్యుయేషన్‌ను ఉపయోగిస్తుంది. గత ఏడాది కంపెనీలో 79 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు మస్క్ 25 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించారు.

Exit mobile version