Site icon NTV Telugu

Twitter: ఉద్యోగులకు ట్విట్టర్‌ షాక్..! ఎలన్‌ మస్క్‌ చెప్పినట్టే..?

Elon Musk

Elon Musk

బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసుకునే ముందు భారీ మార్పులు జరుగుతున్నాయి.. ఎలన్‌ ఎంట్రీ తర్వాత ఆ సంస్థలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం ముందు నుంచే సాగుతోన్న విషయం తెలిసిందే కాగా.. ఆ వార్తలను నిజం చేసే విధంగా తాజాగా హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన టాలెంట్‌ అక్విజేషన్‌ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్నిపక్కన పెట్టింది ఆ సంస్థ.. ఇక, ట్విట్టర్‌ సైతం 100 మంది ఉద్యోగులను తొలగించింది.. ఇందులో ప్రధానంగా రిక్రూటర్లు, కొత్త ఉద్యోగులను బోర్డులోకి తీసుకురావడానికి బాధ్యత వహించే వ్యక్తులే ఉన్నారు. అయితే, ఎలన్ మస్క్‌ ట్విట్టర్‌ టేకోవర్‌ ప్రకటించినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.. ఇక, ట్విట్టర్‌ సక్రమంగా పనిచేయాలని మస్క్ చెప్పిన కొన్ని వారాల తర్వాత తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.. ఇంకా భారీగానే తొలగింపులు ఉంటాయనే సంకేతులు వెలువడుతున్నాయి.

Read Also: ‘Maa Nanna Naxalite’ Movie Review : మా నాన్న నక్సలైట్ రివ్యూ

మస్క్ చేతికి సంస్థను అప్పగించేందుకు ఎంతో కష్టపడుతోన్న ట్విట్టర్‌.. ఖర్చులను తగ్గించుకోవడానికి నియామకాలను కూడా నిలిపివేసింది.. జూన్‌ మాసంలో ట్విట్టర్ ఉద్యోగులతో తొలి సమావేశం నిర్వహించిన మస్క్‌కు ఉద్యోగుల తొలగింపు ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది.. దానికి సమాధానమిచ్చిన ఆయన.. సంస్థ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందిని వ్యాఖ్యానించారు.. అదే సమయంలో ఖర్చును సైతం తగ్గించుకోవాలని సూచించారు.. ప్రస్తుతం ఖర్చులు.. సంస్థకు వచ్చే ఆదాయానికి మించి ఉన్నాయని ప్రస్తావించారు.. భవిష్యత్తులో సాధ్యమయ్యే తొలగింపుల గురించి ఉద్యోగులు అతనిని మళ్లీ ప్రశ్నించినప్పుడు.. కంపెనీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పువు అనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, కీలక మార్పులు ఉంటాయనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలుగుతాం అంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ పలు సందర్భాల్లో బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే..

Exit mobile version