Trump China Tariff: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసింది. ట్రంప్ దెబ్బతో క్రిప్టో మార్కెట్‌లో ఏకంగా $2 ట్రిలియన్లు ఆవిరి అయ్యాయి. అగ్రరాజ్యాధినేత తాజాగా చైనాపై 100% సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బిట్‌కాయిన్ నుంచి ఎథెరియం, డాగ్‌కాయిన్ వరకు క్రిప్టో ఆస్తులన్ని దీని దెబ్బతో క్షీణించాయి. ఇవే కాకుండా US స్టాక్ మార్కెట్ కూడా గణనీయమైన నష్టాలను చవిచూసింది. టెస్లా, అమెజాన్ వంటి స్టాక్‌లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి..
READ ALSO: MLM : క్యూనెట్ మోసానికి యువకుడి బలి.. సిద్ధిపేట జిల్లాలో విషాదం
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. ట్రంప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్లకు పైగా క్రిప్టో పెట్టుబడిదారులను ప్రభావితం చేసిందని పేర్కొంది. ఆయన నిర్ణయం $19 బిలియన్లకు పైగా క్రిప్టో వాటాలను తుడిచిపెట్టింది. కేవలం ఒక గంటలోనే $7 బిలియన్లకు పైగా వాటాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇది డిజిటల్ ఆస్తుల చరిత్రలో అతిపెద్ద అమ్మకాన్ని సూచిస్తుందని నివేదికలు వెల్లడించాయి. ఈరోజు క్రిప్టో మార్కెట్ క్యాప్ $560 బిలియన్లు లేదా 0.56 ట్రిలియన్ వోన్ తగ్గిందని పేర్కొన్నాయి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ $1.75 ట్రిలియన్ల నష్టాలకు లోనైనట్లు తెలిపింది. క్రిప్టో, స్టాక్ మార్కెట్లను కలిపితే పెట్టుబడిదారులు ఒకరోజులో సుమారు $2 ట్రిలియన్లు లేదా ₹177.44 లక్షల కోట్లు కోల్పోయారని వెల్లడించాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. క్రిప్టో మార్కెట్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద లిక్విడేషన్‌కు ట్రంప్ ప్రకటన దారితీసిందని వెల్లడించింది. వ్యాపారులు లివరేజ్డ్ పొజిషన్‌లను లిక్విడేట్ చేయడానికి తొందరపడటంతో $19 బిలియన్లకు పైగా ఆస్తులు తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొంది. దీంతో 1.6 మిలియన్ల పెట్టుబడిదారులు లిక్విడేషన్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో అక్టోబర్ 10వ తేదీ ట్రేడింగ్ మొదటి గంటలోనే $7 బిలియన్లకు పైగా పొజిషన్‌లు స్క్వేర్ చేశారు. మల్టీకాయిన్ క్యాపిటల్‌లో ప్రధాన వ్యాపారి అయిన బ్రియాన్ స్ట్రుగాట్స్, ఎక్స్ఛేంజీలు, డీఫై ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భయం వ్యాపించడంతో మొత్తం మార్కెట్ నష్టాలు $30 బిలియన్లకు మించి ఉండవచ్చని అంచనా వేశారు.
ట్రూత్‌లో.. ట్రంప్ సుంకాల షాక్
ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చే విధంగా అన్ని “క్లిష్టమైన సాఫ్ట్‌వేర్”, చైనా వస్తువులపై 100% సుంకాలు విధించే తన ప్రణాళికను ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ప్రకటించారు. అరుదైన భూమి ఖనిజాలపై చైనా కొత్త ఆంక్షల తర్వాత ఈ నిర్ణయం వచ్చిందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
గందరగోళంలో క్రిప్టో మార్కెట్..
చైనాపై అమెరికా టారిఫ్ షాక్ తర్వాత.. అక్టోబర్ 11 మధ్యాహ్నం 12:42 గంటల సమయానికి బిట్‌కాయిన్ 8% కంటే ఎక్కువ తగ్గి $111,542.91కి చేరుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.22 ట్రిలియన్లకు తగ్గింది. అయితే వ్యాపారులు లివరేజ్డ్ పొజిషన్ల నుంచి నిష్క్రమించడానికి తొందరపడటంతో ట్రేడింగ్ 145% పెరిగి $183.88 బిలియన్లకు చేరుకుంది. రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన Ethereum, 12.7% తగ్గి $3,778.31కి చేరుకుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $456.05 బిలియన్ల వద్ద ఆగింది. ట్రేడింగ్ పరిమాణం 148% పెరిగి $112.75 బిలియన్లకు వచ్చింది. ఇది గణనీయమైన అమ్మకాల ఒత్తిడిని సూచిస్తుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. CoinMarketCap నివేదికల ప్రకారం.. మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక రోజులో $4.30 ట్రిలియన్ల నుంచి $3.74 ట్రిలియన్లకు పడిపోయింది. ఇది 24 గంటల్లో దాదాపు $560 బిలియన్ల నష్టాన్ని సూచిస్తుందని నివేదికలు వెల్లడించాయి.
READ ALSO: Muslim Ccountry Bans Hijab: ముస్లిం దేశంలో బుర్ఖా నిషేధం.. ఇస్లామిక్ దేశాల్లో ఈ దేశం తీరే వేరు!