Rajamouli: ‘వారణాసి’ కోసం క్యూ కడుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కానీ జక్కన్న ప్లాన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
READ ALSO: Kadiyam Srihari : కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
Also Read
ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని కోకాపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ క్లోజ్ అయిన వెంటనే, చిత్ర బృందం జార్జియా వెళ్లడానికి రడీ అవుతుందని సమాచారం. ఇదే టైంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏపీ, తూర్పు గోదావరి ఏరియాకు రూ.18 కోట్ల ఆఫర్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి ఈ రేంజ్‌లో భారీ ఆఫర్లు వచ్చినా తక్షణమే బిజినెస్ స్టార్ట్ చేసేందుకు జక్కన్న టీమ్ ఆసక్తిగా లేదని సమాచారం. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలోనే వారణాసి మూవీ విషయంలో కూడా రాజమౌళి స్ట్రాటజీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే వారణాసి సినిమా పూర్తయ్యాకే పూర్తి స్థాయి మార్కెట్ వ్యూహంతో డిస్ట్రిబ్యూషన్‌కు వెళ్లాలని రాజమౌళి టీం ప్లాన్ అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!