PVC Aadhar Card: ఆధార్ వినియోగదారులకు కీలకమైన సమాచారం. ఆధార్ PVC కార్డ్ పొందేందుకు చెల్లించాల్సిన ధరను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పెంచింది. జనవరి 2026 నుంచి ఆధార్ PVC కార్డ్ ఫీజు రూ.50 నుంచి రూ.75కి పెరిగినట్లు UIDAI అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ధర myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని కొత్త అభ్యర్థనలకు వర్తిస్తుంది.
UIDAI విడుదల చేసిన మెమోరాండం ప్రకారం.. జనవరి 1, 2026 నుంచి బుక్ చేసే ఆధార్ PVC కార్డ్ ఆర్డర్లకు ఈ సవరించిన ధర అమల్లోకి వచ్చింది. ఈ రూ.75 ఫీజులో పన్నులు, హోం డెలివరీ ఛార్జీలు కూడా కలిపే ఉన్నాయి. 2020లో ఆధార్ PVC కార్డ్ సేవ ప్రారంభమైనప్పటి నుంచి మొదటిసారిగా ధరను పెంచారు.
Fatty Liver ఉన్నవారు గోధుమ రొట్టెలు తినవచ్చా.? నిపుణులు ఏమంటున్నారు.?
ఆధార్ PVC కార్డ్ అంటే..
ఆధార్ PVC కార్డ్ అంటే ఏమిటంటే.. ఇది ప్లాస్టిక్‌తో తయారు చేసిన చిన్న పరిమాణంలోని ఆధార్ కార్డ్. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సైజ్‌లో ఉండే ఈ కార్డ్, సాధారణ కాగితపు ఆధార్ కార్డుతో పోలిస్తే మరింత బలంగా, సులభంగా తీసుకెళ్లేలా రూపొందించారు. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఇది వస్తుంది. ఫార్మాట్ వేరు అయినప్పటికీ, దీనికి సాధారణ ఆధార్ లేదా ఈ-ఆధార్‌తో సమానమైన చట్టపరమైన విలువ ఉంటుంది.
ధర పెంపుకు కారణాన్ని UIDAI స్పష్టంగా తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ముడి పదార్థాల ఖర్చు, ప్రింటింగ్ ఖర్చులు, సెక్యూర్ డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయని పేర్కొంది. పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని, నాణ్యమైన సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఫీజును సమీక్షించినట్లు UIDAI తెలిపింది. ఇప్పటివరకు ఉన్న రూ.50 ఫీజు సేవ ప్రారంభమైనప్పటి నుంచి మార్పు లేకుండా కొనసాగిందని కూడా స్పష్టం చేసింది.
2.8K డిస్‌ప్లే, Dimensity 7300 Max, 12,200mAh బ్యాటరీతో Realme Pad 3 భారత్‌లో లాంచ్..!
ఆధార్ PVC కార్డ్ అనేది అసలు ఆధార్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఇందులోని సమాచారం, చెల్లుబాటు అన్నీ సాధారణ ఆధార్ కార్డ్, ఈ-ఆధార్‌తో సమానమే. వినియోగదారులు తమకు అనుకూలమైన ఏ రూపంలోని ఆధార్‌నైనా ఉపయోగించుకోవచ్చు. డెలివరీ విషయానికి వస్తే.. ఆధార్ PVC కార్డ్ ఆర్డర్ చేసిన ఐదు పని దినాల్లో UIDAI ఆ కార్డును ఇండియా పోస్టుకు అందజేస్తుంది. అనంతరం స్పీడ్ పోస్టు ద్వారా ఆధార్‌లో నమోదైన చిరునామాకు పంపిస్తారు. డెలివరీ సమయం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. మొత్తంగా ఆధార్ PVC కార్డ్ కోరుకునే వినియోగదారులు ఇకపై రూ.75 చెల్లించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది.