Site icon NTV Telugu

Health insurance: రూ.5 లక్షల వైద్య బీమాతో రూ.50 లక్షల విలువైన చికిత్స!

Health Insurance

Health Insurance

ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు రోగి కుటుంబ సభ్యులు తమ నగలు, ఒక్కోసారి ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో.. ఆరోగ్య బీమా చేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తుతుతాయి. ఆరోగ్య బీమా కవరేజ్ తక్కువగా తీసుకుంటుంటాం. కానీ తీవ్రమైన అనారోగ్యం లేదా తీవ్రమైన ప్రమాదం సంభవించినప్పుడు.. కవరేజ్ తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ కవర్ కోసం బీమా తీసుకుంటే.. మీరు అధిక ప్రీమియం చెల్లించాలి. ఈ కారణంగా, చాలా మంది ప్రజలు అధిక కవర్‌తో ఆరోగ్య బీమా తీసుకోకుండా ఉంటారు. అయితే ప్రస్తుతం మీరు టాప్-అప్ తీసుకోవడం ద్వారా తక్కువ బీమాతో ఖరీదైన చికిత్సను కూడా పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడే చూడండి.

READ MORE: Viraaji: వరుణ్ సందేశ్ సినిమాలో వేణు స్వామి?

టాప్-అప్ ప్లాన్ అంటే ఏమిటి?
చాలా మంది రూ. 5 లక్షల బేసిక్ కవర్‌తో ఆరోగ్య బీమా తీసుకుంటారు. చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని సొంత జేబులోంచి చెల్లించాలి. టాప్-అప్ విషయంలో ఇలా జరగదు. ఒక విధంగా, ఇది ఆరోగ్య బీమా లాంటిది. కానీ ప్రాథమిక ఆరోగ్య బీమా కంటే భిన్నమైనది. దీని ప్రీమియం సాధారణ ఆరోగ్య బీమా కంటే చాలా తక్కువ. ప్రాథమిక బీమా కవర్ ముగిసినప్పుడు ఈ టాప్-అప్‌లు ఉపయోగపడతాయి.

READ MORE:Buddy: అల్లు వారబ్బాయి సినిమాలో ‘జై బాలయ్య’కి సూపర్ రెస్పాన్స్

ఎంత ప్రీమియం చెల్లించాలి?
ఒక వ్యక్తి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే.. బీమా ప్రీమియం ఎంత అనేది అతని వయస్సుపై ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సు, ప్రీమియం తక్కువగా ఉంటుంది. రూ. 5 లక్షల కవర్‌తో ఆరోగ్య బీమా కోసం వార్షిక ప్రీమియం దాదాపు రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆ వ్యక్తి రూ. 50 లక్షల టాప్-అప్ తీసుకుంటే, అతని వార్షిక ప్రీమియం దాదాపు రూ. 2 నుంచి 3 వేలు మాత్రమే. అటువంటి పరిస్థితిలో.. ఆ వ్యక్తి రూ. 5 లక్షల ప్రాథమిక ఆరోగ్య బీమాపై రూ. 50 లక్షల విలువైన చికిత్సను పొందవచ్చు. దీని వార్షిక ప్రీమియం కూడా దాదాపు రూ.13 వేలు మాత్రమే.

READ MORE:Samesh Jung: మను భాకర్-సరబ్జోత్ సింగ్ కోచ్ ఇంటిని కూల్చేయనున్న ప్రభుత్వం..!

టాప్-అప్ హెల్త్ ప్లాన్ ప్రత్యేక లక్షణాలు..
మీరు టాప్-అప్ హెల్త్ ప్లాన్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రతి క్లెయిమ్‌పై దీన్ని అమలు చేస్తున్నాయి. అంటే పరిమితిని చేరుకునే వరకు మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేయవచ్చు. ప్రాథమిక ఆరోగ్య బీమా మినహాయించదగిన పరిమితిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. మినహాయింపు పరిమితిని మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది ప్రాథమిక ఆరోగ్య బీమా కవర్ కంటే ఎక్కువగా ఉండకూడదు.

Exit mobile version