NTV Telugu Site icon

TRAI: స్పామ్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు..

Trai

Trai

TRAI: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్‌వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రమోషనల్ కాల్స్ విషయంలో కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ పేర్కొనింది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రిజిస్టర్ లేని టెలి మార్కెటింగ్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌పై ఫిర్యాదుల కారణంగా ఆయా టెలి మార్కెటింగ్ కంపెనీల డేటాను తమకు అందించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ తెలిపింది.

Read Also: Kolkata Doctor case: హత్యాచార ఘటన ఎఫెక్ట్.. కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు

అయితే, నిబంధనలను పాటించకుండా ఏ కంపెనీ అయినా ప్రమోషనల్ కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని ట్రాయ్ స్పష్టం చేసింది. తక్షణం ప్రమోషల్ కాల్స్ నిలిపేయడమే కాకుండా అలాంటి కాల్స్‌పై తీసుకున్న చర్యల గురించి త్వరగా వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. నెలవారీగా 1, 16వ తేదీల డేటాను తమకు సమర్పించాలని పేర్కొంది. కాగా, ఈ అంశంపై గత వారం జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్‌ లాంటి మొబైల్‌ కంపెనీల చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రాయ్‌ చీఫ్‌ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు వెలువరించింది.