Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kobbari Undalu: సాంప్రదాయ పిండి వంటల్లో కొబ్బరి ఉండలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చిన్నతనంలో బడ్డీ కొట్ల వద్ద కొనుక్కుని తిన్న ఆ స్వీట్ మ్యాజిక్ ఇప్పటికి గుర్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది పాకం పట్టడం కష్టమని వీటిని ఇంట్లో చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం ఎటువంటి పాకం అవసరం లేకుండా, కేవలం కొబ్బరి, బెల్లంతోనే అచ్చం పాతకాలపు రుచితో కొబ్బరి లడ్డూలను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
కావలసిన పదార్థాలు:
పచ్చి కొబ్బరి తురుము: 4 కప్పులు
తురిమిన బెల్లం: 3 కప్పులు
యాలకల పొడి (ఐచ్ఛికం): తగినంత
తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి తురిమినట్లుగా వస్తుంది. ఒక గిన్నెను కొలతగా తీసుకుని, 4 కప్పుల కొబ్బరి తురుముకు 3 కప్పుల బెల్లం తురుమును తీసుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాన్‌లో కొబ్బరి తురుము, బెల్లం వేసి స్టవ్ మీద పెట్టాలి. మొదట మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. సుమారు అరగంట సమయం తర్వాత మిశ్రమం పాన్ నుంచి వేరవుతున్నప్పుడు, కొద్దిగా తీసుకుని ఉండ చుట్టి చూడాలి. చేతికి అంటకుండా ఉండ తయారైతే పదును వచ్చినట్లే. తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకోకపోయినా పర్వాలేదు (కొబ్బరిలోని నూనె సరిపోతుంది), చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి ఎలాంటి నెయ్యి లేదా ఇతర పదార్థాలు వాడనక్కర్లేదు. మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం యాలకల పొడి వేసుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన కొబ్బరి రుచి కావాలనుకుంటే కేవలం పైన చెప్పిన పద్ధతిని ఫాలో అయితే మంచింది.
ప్రయోజనాలు ఇవే..
కొబ్బరి, బెల్లం కలిపి తీసుకునే ఈ కొబ్బరి ఉండలు కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, బెల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయన్నారు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక కొబ్బరి ఉండను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇది ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. బెల్లం సహజంగానే జీర్ణ ఎంజైములను ప్రేరేపించి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలంగా ఉంచుతాయన్నారు. చిన్న పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, పెద్దవారిలో కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇవి విశేషంగా సహాయపడతాయని వివరించారు. కొబ్బరిలోని ‘లారిక్ యాసిడ్’ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయని పేర్కొన్నారు.
READ ALSO: Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!