NTV Telugu Site icon

Gold Rates: పసిడి ప్రియులకు వరుస షాక్‌లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!

Gold

Gold

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత వారం తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఇప్పుడు వరుసగా పెరుగుతోంది. వరుసగా నాల్గో రోజు కూడా ధరలు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,140 పెరగగా.. నేడు రూ.220 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.83,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.91, 200గా కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే వెండి ధరలు మాత్రం శనివారం స్వల్ప ఊరటనిచ్చింది. నిన్న భారీగా పెరిగిన వెండి ధర.. ఇవాళ రూ.1,000 తగ్గింది. దీంతో శనివారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1, 04,000గా ఉంది.

ఇది కూడా చదవండి: Amit Shah: లోక్‌సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు