మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా బంగారం కొంటుంటారు. కొందరు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి.
Read Also: శుభవార్త.. భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ ధరలు..!
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.50,100గా నమోదైంది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,900గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.68,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విశాఖ బులియన్ మార్కెట్‌లోనూ హైదరాబాద్ మార్కెట్ ధరలే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22 పెరిగి.. రూ.24,590 గా నమోదైంది. విశాఖ, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
