NTV Telugu Site icon

Today (19-12-22) Stock Market Roundup: ఈ వారం శుభారంభం. ఇవాళ లాభాల బాటలో పయనం.

Today (19 12 22) Stock Market Roundup

Today (19 12 22) Stock Market Roundup

Today (19-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కాసేపట్లోనే లాభాల బాట పట్టి చివరికి భారీ ప్రాఫిట్స్‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 468 పాయింట్లు పెరిగి 61 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ 157 పాయింట్లు ప్లస్సయి 18 వేల 426 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 5 సంస్థలు మాత్రమే వెనకబడ్డాయి. వీటిలో టీసీఎస్‌ షేరు భారీగా పతనమైంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో ఇన్సూరెన్స్‌ సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు, పాలసీ బజార్‌, బీహెచ్‌ఈఎల్‌ లాభాలు పొందిన జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో అదానీ సంస్థలతోపాటు ఐచర్‌ మరియు మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీల షేర్లు 3 నుంచి 4 శాతం ర్యాలీ తీశాయి.

read also: Record Level Cars Sales: కొత్తల్లుడికి అత్తింటివారి కానుక

నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ స్టాక్స్‌ భాగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్‌, ఆటోమొబైల్‌ సెక్టార్లు 1 శాతానికి పైగా ప్రాఫిట్స్‌ పొందాయి. ఐటీ రంగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. స్టాక్స్‌వారీగా పరిశీలిస్తే.. లాయిడ్స్‌ మెటల్‌ కంపెనీ తలపెట్టిన 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పటంతో ఆ సంస్థ స్టాక్‌ విలువ నాలుగు రోజుల్లోనే 26 శాతం పెరిగింది.

10 గ్రాముల బంగారం రేటు 177 రూపాయలు పెరిగి 54 వేల 477 రూపాయల వద్ద క్లోజ్‌ అయింది. కిలో వెండి ధర 445 రూపాయలు లాభపడి 68 వేల 95 రూపాయల వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 72 పైసల వద్ద స్థిరపడింది.

Show comments