NTV Telugu Site icon

Elon Musk: ఎలాన్ మస్క్ కి ఎదురుదెబ్బ.. మాజీ ఉద్యోగికి రూ.5కోట్ల పరిహారం!

Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్‌గా మార్చారు. అలాగే దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్‌ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

READ MORE: Live Location: మహిళ హత్య కేసులో పోలీసులకు సాయపడిన ‘‘లైవ్ లొకేషన్’’.. ఏం జరిగిందంటే..

ఎలాన్ మస్క్ యొక్క “అత్యంత హార్డ్‌కోర్” వర్క్ కల్చర్ అల్టిమేటం జారీ చేశారు. ఇక నుంచి అత్యంత కఠినంగా పనిచేయాలని సూచించారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. 24 గంటల్లో తమ అంగీకారాన్ని వెల్లడించాలని తెలిపారు. ఓ సీనియర్ ఉద్యోగి మెయిల్ పై ప్రతి స్పందించ లేదు. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. మస్క్. తొలగించిన ఆ ఉద్యోగి పేరు.. గ్యారీ రూనీ. గ్యారీ తనకు జరిగిన అన్యాయం పై ఐర్లాండ్ యొక్క వర్క్‌ప్లేస్ రిలేషన్స్ కమిషన్ ను ఆశ్రయించారు. తాజాగా తీర్పు వెలువరించిన డబ్ల్యూఆర్ సీ..అనుభవజ్ఞుడైన గ్యారీ రూనీని అన్యాయంగా తొలగించారని పేర్కొంది. మాజీ ఉద్యోగికి సుమారు $600,000 (5,03,77,800 రూపాయలు) చెల్లించాలని తెలిపింది.

READ MORE:BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?

న్యాయనిర్ణేత మైఖేల్ మాక్‌నామీ మస్క్ అల్టిమేటమ్‌ను విమర్శించారు. ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి 24 గంటల గడువు పెట్టడం సరికాదని.. పేర్కొన్నారు. మెయిల్ కి అంగీకరించకుంటే ఉద్యోగంలో నుంచి తీసేయడం సరికాదన్నారు. సోర్స్-టు-పే డైరెక్టర్‌గా పనిచేసిన రూనీ.. ఇది మాల్‌వేర్ కావచ్చునని భయపడి ఇమెయిల్‌ను తెరవడం పట్ల తాను జాగ్రత్తగా ఉన్నానని పేర్కొన్నారు. ఇంకా తొమ్మిదేళ్ల సర్వీస్ ఉన్నా.. రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడికి రూ.దాదాపు 5కోట్లు ఇవ్వాలని న్యాయనిర్ణేత మైఖేల్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.

Show comments