Site icon NTV Telugu

Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త కళ.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం సరికొత్త కళ సంతరించుకుంది. ట్రంప్ సుంకాలతో సోమవారం ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా మారింది. కానీ కొన్ని గంటల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. కొన్ని గంటల క్రితం భారీగా కుప్పకూలిన సూచీలు.. దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాంటిది కొన్ని గంటల్లోనే ఆశ్చర్యకర మార్పు చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Box Office : ఉగాది సినిమాల రిజల్ట్స్ .. వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ప్రస్తుతం సెన్సెక్స్ 1,103 పాయింట్ల లాభంతో 74, 241 దగ్గర కొనసాగుతుండగా… నిఫ్టీ 342 పాయింట్లు లాభపడి 22, 504 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లడం విశేషం. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ప్రధాన లాభాల్లో దూసుకెళ్తున్నాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: US-China Trade War: నువ్వు భయపెడితే భయపడం.. అమెరికాకు చైనా వార్నింగ్

Exit mobile version