Site icon NTV Telugu

Stock Market: కలిసొచ్చిన ట్రంప్ ప్రకటన.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో నూతనోత్సహాన్ని నింపింది. దీంతో అమెరికా మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు భారీ లాభాలు అర్జిస్తున్నాయి. ఇక ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం.. మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో మంగళవారం సూచీలు భారీ లాభాల పట్టింది.

ఇది కూడా చదవండి: MS Dhoni: నాకు ఈ అవార్డు ఎందుకు.. నా కంటే అతడే బాగా ఆడాడు!

ప్రస్తుతం సెన్సెక్స్ 1,578 పాయింట్లు లాభపడి 76, 735 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 479 పాయింట్లు లాభపడి 23. 308 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం ప్రధాన లాభాలను ఆర్జించాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. రియల్టీ ఇండెక్స్ 4 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చదవండి: SLBC Tunnel: చివరి దశకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా లభించని ఆరు మృతదేహాలు

Exit mobile version