Site icon NTV Telugu

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. బుధవారం మాత్రం కొనుగోళ్లు ఆవిరైపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడి కొనసాగింది. సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 924 దగ్గర ముగియగా.. నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 24, 324 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Crime: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యపై సవతి కొడుకు అత్యాచారం..

నిఫ్టీలో ఎం అండ్ ఎం, టాటా స్టీల్, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ అత్యధికంగా నష్టపోగా.. వాటిలో ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక సెక్టార్లలో ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెలికాం, మీడియా రంగాలు క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Krithi Shetty: ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి

Exit mobile version