Site icon NTV Telugu

Telangana Company: తెలంగాణ కంపెనీకి ‘మహా’ ఆర్డర్‌

Telangana Company

Telangana Company

Telangana Company: హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్‌, మెయింటనెన్స్‌ బాధ్యతలను థానే మునిసిపల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. లిథియం అయాన్‌లతో రూపొందించే ఈ బస్సుల బ్యాటరీలను నాలుగు గంటల్లోనే రీఛార్జ్‌ చేయొచ్చు. 55 బస్సులను 12 మీటర్ల పొడవున, 68 బస్సులను 9 మీటర్ల పొడవున తయారుచేయనున్నారు.

కిమ్స్‌లోని షేర్ల అమ్మకం

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లోని 12 లక్షలకు పైగా షేర్లను జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షేర్లను 151 కోట్ల 25 లక్షల రూపాయలకు ఓపెన్‌ మార్కెట్‌లో అమ్మినట్లు తెలుస్తోంది. ఒక్కో షేర్‌ యావరేజ్‌గా 12 వందల 50 రూపాయలు పలికినట్లు బీఎస్‌ఈ బల్క్‌ డీల్స్‌ని బట్టి అర్థమవుతోంది. ఈ నెలారంభంలో కూడా ఈ సంస్థ పదహారున్నర లక్షలకు పైగా షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికం ముగిసేనాటికి కిమ్స్‌లో జనరల్‌ అట్లాంటిక్‌కి 17 పాయింట్‌ రెండు నాలుగు శాతం వాటా ఉంది.

RBI Orders: అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

‘రూపాయి-రియాల్స్‌’లో చెల్లింపులు

ఇండియా కరెన్సీ రూపాయి, సౌదీ అరేబియా కరెన్సీ రియాల్స్‌లో వాణిజ్య చెల్లింపులు చేసేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు కోసం ఈ రెండు దేశాలు లేటెస్టుగా చర్చలు జరిపాయి. దీంతోపాటు ఆ గల్ఫ్ దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సిస్టమ్‌ను మరియు రూపే కార్డును ప్రవేశపెట్టే విషయం కూడా ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఈ నెల 18 మరియు 19 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన వివిధ అంశాలపై సౌదీ అరేబియాతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై రూపాయల్లో చేయాలని ఆర్బీఐ ఈమధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Exit mobile version