ఐటీ కంపెనీల్లో ఉద్యోగం అంటే నేటి యువతకు మక్కువ ఎక్కువ.. వర్క్ టెన్షన్ సంగతి ఎలా ఉన్న.. మంచి వేతలనాలు ఉండడంతో.. క్రమంగా యూత్ అటు మొగ్గు చూపుతుంది.. అయితే, టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు వేగంగా ఆటోమేషన్‌కు మారుతున్నాయి.. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో.. పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల కోత పడనుంది తన నివేదికలో పేర్కొంది బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అక్కడ సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవడానికి ఆయా సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.. ఈ చర్యతో అత్యధికంగా జీతాల రూపంలో ఏడాదికి 100 బిలియన్ డాలర్లను ఆయా కంపెనీలు ఆదా చేసుకోవడానికి ఇది దోహదపడుతోందని పేర్కొంది ఆ నివేదిక.. నాస్కామ్ ప్రకారం ప్రస్తుతం ఐటీ రంగంలో సుమారు 16 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు.. కానీ, అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు, బీపీవో రంగంలో పనిచేస్తున్నట్టుగా అంచనాలున్నాయి.. ఐటీలో దిగ్గజ కంపెనీలుగా పేరున్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు రోబో ప్రాసెస్ ఆటోమేషన్ అప్‌స్కిల్లింగ్ కారణంగా 2022 నాటికి నైపుణ్యం తక్కువగా ఉన్న సుమారు 3 మిలియన్ల మంది ఉద్యోగులను తగ్గించాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.