Site icon NTV Telugu

TCS: యూఎస్ ఉద్యోగులపై వివక్ష ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీసీఎస్‌

Tcs

Tcs

TCS: దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్‌ తీరుపై పక్షపాతంగా లే ఆఫ్‌లు అమలు చేస్తోందని పేర్కొంటున్నారు. హెచ్‌1 బీ వీసా కలిగిన భారతీయ ఎంప్లాయిస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాగా, ఈ ఆరోపణల్ని టీసీఎస్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మాటల్లో వాస్తవం లేదని కేవలం తప్పుడు ఆరోపణలు మాత్రమే అని పేర్కొన్నారు. తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని టాటా కన్సల్టెన్సీ వెల్లడించింది. కాగా, ఈ వివాదంపై అమెరికాలో సమాన ఉపాధి అవకాశాల కమిషన్‌ విచారణ కొనసాగిస్తుంది.

Read Also: Arjun Son of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

కాగా, గతంలో బ్రిటన్‌లో ముగ్గురు టీసీఎస్‌ ఉద్యోగులు వయసు, జాతీయత ఆధారంగా వివక్షకు గురైనట్లు ది గార్డియన్‌ నివేదించింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే ఫలితాలను ప్రకటించిన టీసీఎస్‌.. అమెరికా కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపు రేటు 13 శాతం నుంచి 13.3 శాతం పెరిగింది. యూఎస్ టారిఫ్‌ల కారణంగా వరల్డ్ వైడ్ గా తలెత్తిన అనిశ్చితితో 6.07 లక్షల మంది ఉద్యోగులకు వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version