Site icon NTV Telugu

TATA Motors : ఆ వాహనాల ధరలు పెంపు..

Homegrown auto major Tata Motors on Tuesday has announced an impending price hike of its commercial vehicle range. 

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగ‌ళ‌వారం రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో పేర్కొంది. వివిధ ర‌కాల మోడ‌ల్స్‌, వేరియంట్ వెహిక‌ల్స్‌ను బ‌ట్టి ఆయా వాహ‌నాల ధ‌ర‌లు పెరుగుతాయ‌న్న‌ది. స్టీల్‌, అల్యూమినియం, వాహ‌నాల త‌యారీలో వాడే ఇత‌ర విలువైన లోహాల ధ‌ర‌లు శ‌ర‌వేగంగా పెరిగాయ‌ని టాటా మోటార్స్ పేర్కొంది. ముడి స‌రుకుపై పెరిగిన ఖ‌ర్చుల‌కు ఇది అద‌నంగా మారింద‌ని వెల్లడించింది.

ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోవ‌డంతో అన్ని ర‌కాల మోడ‌ల్ కార్లు, వాహ‌నాల‌పై మూడు శాతం వ‌ర‌కు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని గ‌త వారం మెర్సిడెస్ బెంజ్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌పుట్‌ ఖర్చుల పెరుగుదలను ప్రభావాన్ని తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమని టాటా మోటార్స్‌ ప్రకటించింది. మరో వైపు ఈవీ వాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్‌ ఈవీ ధరను సుమారు రూ. 25 వేలకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

https://ntvtelugu.com/kalvakuntla-kavitha-fired-on-bjp-at-twitter/
Exit mobile version