Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- సన్ ఫార్మా రూ.1,00,000 కోట్ల డీల్
- ఒక్క రోజే రూ.35 వేల కోట్లు పెరిగిన కంపెనీ విలువ
- కంపెనీ షేర్లు 9% అప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sun Pharma: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా (Sun Pharma) చరిత్రలో నిలిచిపోయే భారీ డీల్‌ను ప్రకటించిన తర్వాత, ఆ కంపెనీ ఫౌండర్ దిలీప్ సంఘ్వీ సంపద అనూహ్యంగా పెరిగింది. అమెరికన్ ఫార్మా సంస్థ ‘ఆర్గానన్’ (Organon) ను సుమారు రూ.1 లక్ష కోట్లతో కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలతో సన్ ఫార్మా షేర్లు మార్కెట్లో రాకెట్‌లా దూసుకుపోయాయి. ఈ డీల్ బయటకు రాగానే సోమవారం ట్రేడింగ్‌లో సన్ ఫార్మా షేర్లు ఒక దశలో 9 శాతం వరకు లాభపడ్డాయి. ఉదయం రూ.1632.50 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన ఈ కంపెనీ షేర్, మధ్యాహ్నం సమయానికి రూ.1,766.65 గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి దాదాపు 7 శాతం లాభంతో రూ.1,733.15 వద్ద ట్రేడ్ అవుతోంది. గతంలో ‘రాన్‌బాక్సీ’ని కొనుగోలు చేసిన సన్ ఫార్మాకు, ఈ ‘ఆర్గానన్’ డీల్ అంతర్జాతీయంగా మరింత బలాన్ని ఇస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క రోజులోనే రూ.35 వేల కోట్ల సంపద
ఈ కంపెనీ షేర్ల ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. గత వారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ కంపెనీ విలువ రూ.3,88,715.97 కోట్లు ఉండగా.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇది ఏకంగా రూ. 4,23,917.44 కోట్లకు చేరింది. అంటే కేవలం ఒక్క రోజులోనే కంపెనీ విలువలో రూ.35,201.47 కోట్ల పెరుగుదల కనిపించింది.
Also Read
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
దిలీప్ సంఘ్వీ నెట్ వర్త్ ఎంతంటే..
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ గణాంకాల ప్రకారం.. సన్ ఫార్మా ఫౌండర్ అండ్ ఎండీ దిలీప్ సంఘ్వీ వ్యక్తిగత సంపద 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15 వేల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తి విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు ఇదే జోరును కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో ఆయన సంపద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో గ్లోబల్ ఫార్మా మార్కెట్లో సన్ ఫార్మా తన పట్టును పెంచుకోవడానికి ఈ లక్ష కోట్ల రూపాయల డీల్ కీలకం కానుందని సమాచారం. అమెరికా మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడంతో పాటు, కొత్త ఉత్పత్తుల తయారీలో కంపెనీకి ఇది ఎంతో మేలు చేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!