NTV Telugu Site icon

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త సేవలు ప్రారంభం.. డేటాతో పనిలేకుండా ఐఎఫ్‌టీవీ ప్రసారాలు

Bsnllivetv

Bsnllivetv

ప్రైవేటు టెలీకాం సంస్థలు ఆయా సేవలతో దూసుకుపోతున్నాయి. కస్టమర్లకు తగ్గట్టుగా సేవలు అందిస్తూ మన్నలు పొందుతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఫైబర్‌ యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతానికి తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ టు హోమ్‌ వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మ‌హేష్‌?

దేశంలో జియో, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు ఫైబర్‌ యూజర్లకు లైవ్‌టీవీ ఛానళ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. టీవీ ఛానళ్లను వీక్షించినప్పుడు వినియోగించే డేటా నెలవారీ కోటా నుంచి మినహాయిస్తున్నాయి. అలాగే ఇప్పుడు బీఎస్ఎన్‌ఎల్‌ లైవ్‌ టీవీ ఛానళ్లు.. డేటాతో సంబంధం లేకుండానే లభించనున్నాయి. ఛానళ్లు ఎలాంటి ఎక్స్‌ట్రా మొత్తం చెల్లించకుండానే పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఐఎఫ్‌టీవీ సేవలు ఆండ్రాయిడ్‌ టీవీల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 10, ఆపై వెర్షన్‌ వాడుతున్న వారు బీఎస్‌ఎన్‌ఎల్‌ లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వీక్షించొచ్చని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ త్వరలోనే ఈ సేవలను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bombay HC: ‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..

Show comments