Site icon NTV Telugu

Stock Market: చమురు ధరల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌ను యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి మార్కెట్ భారీగా పతనం అవుతూ వచ్చింది. తాజాగా చమురు ధరలు పెరగడంతో మార్కెట్ ఢమాల్ అయింది. భారీ నష్టాల్లో సూచీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 907 పాయింట్లు నష్టపోయి 75, 138 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 301 పాయింట్లు నష్టపోయి 23, 337 దగ్గర కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి, ఆటో, బ్యాంకులు, రియాల్టీ, ఐటీ, మెటల్, మీడియా ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం తగ్గాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, నాల్కో ఎన్‌ఎస్‌ఇలో అత్యంత చురుగ్గా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి

Exit mobile version