Site icon NTV Telugu

Stock Market: వెనిజులా సంక్షోభం.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు

Stockmarket

Stockmarket

అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొ్న్న మార్కెట్.. ఈ ఏడాదైనా కుదటపడుతుందని అనుకుంటున్న తరుణంలో తాజాగా వెనిజులా రూపంలో సరికొత్త సంక్షోభం ముంచుకొచ్చింది. దీంతో మార్కెట్ వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. బుధవారం కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి 84,914 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 26, 422 దగ్గర కొనసాగుతోంది.

నిఫ్టీలో టైటాన్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, విప్రో ప్రధాన లాభాలను ఆర్జించగా.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మాక్స్ హెల్త్‌కేర్, భారతి ఎయిర్‌టెల్ నష్టపోయాయి. ఇక బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

Exit mobile version