Stock Market: ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి
  • నష్టాల్లో స్టాక్ మార్కెట్
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా డీల్ తర్వాత మంగళవారం మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. ఇన్వెస్టర్ల పంట పండింది. ఇక మార్కెట్‌కు తిరిగి లేదని అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఆర్బీఐ పాలసీ వెల్లడించనుంది. అయినా కూడా మార్కెట్‌లో మార్పు ఏం కనిపించలేదు. ఉదయం మార్కెట్ ప్రారంభం దగ్గర నుంచి నష్టాల్లో సూచీలు వెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి: Punjab: జలంధర్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు ఒబెరాయ్ హత్య

ప్రస్తుతం సెన్సెక్స్ 278 పాయింట్లు లాభపడి 83,035 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 25,538 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. మాక్స్ హెల్త్‌కేర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం తగ్గింది, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం తగ్గింది. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్