దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈ వారం ప్రారంభం నుంచీ సూచీలు నష్టాలను చవిచూస్తు్న్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక ముగింపులో సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 76, 138 దగ్గర ముగియగా.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 23,031 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.89 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..
నిఫ్టీలో టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ అత్యధికంగా లాభపడగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఓఎన్‌జీసీ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Indian Navy: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? ఇండియన్ నేవీలో జాబ్స్ రెడీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి