NTV Telugu Site icon

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

న్యూఇయర్‌ ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త జోష్ కనిపించింది. రెండు రోజుల పాటు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఉత్సాహతతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. రెండు రోజుల పాటు కొనసాగిన జోష్‌కు శుక్రవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాల కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరిదాకా ఒడిదుడుకులు కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 720 పాయింట్లు నష్టపోయి 79, 223 దగ్గర ముగియగా.. నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 24, 004 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Mahindra BE 6, XEV 9e Prices: మహీంద్రా BE 6, XEV 9e వేరియంట్ల వారీగా ధరలు తెలుకుందామా?

నిఫ్టీలో విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోగా.. ఒఎన్‌జీసీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌యుఎల్ లాభపడ్డాయి. సెక్టార్లలో బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఫార్మా ఒక్కొక్కటి 1 శాతం క్షీణించగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. బీఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.

ఇది కూడా చదవండి: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్

Show comments