Site icon NTV Telugu

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టింది. దీంతో దాదాపుగా రూ.10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. వారం ముగింపులోనైనా మెరుపులుంటాయనుకుంటే.. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ భారీ నష్టాలతో ముగిసింది. రెండేళ్లలో ఇంత భారీ నష్టాన్ని చవిచూసింది ఈ వారమే కావడం విశేషం. 2022 జూన్‌ తర్వాత అతిపెద్ద భారీ పతనం ఇదేనని నిపుణులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..

ఇక శుక్రవారం మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 1, 176 పాయింట్లు నష్టపోయి 78, 041 దగ్గర ముగియగా.. నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23, 587 దగ్గర ముగిసింది. నిఫ్టీలో అతిపెద్ద నష్టాల్లో ట్రెంట్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. రియాల్టీ ఇండెక్స్ 4 శాతం, ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, టెలికాం, పిఎస్‌యు బ్యాంక్ 2 శాతం చొప్పున నష్టపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతానికి పైగా నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: UP: తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించిన అయోధ్య.. దేంట్లో అంటే..!

Exit mobile version