NTV Telugu Site icon

Stock Market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమై గ్రీన్‌లో ముగిసింది. మళ్లీ ఒక్కరోజులేనే ఆ ఉత్సాహం ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు.. అదానీ గ్రూప్‌పై అమెరికా ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలతో మార్కెట్ కుదేలైంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలానే కొనసాగింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 77, 155 దగ్గర ముగియగా.. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 23, 349 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.50 దగ్గర తాజా రికార్డు స్థాయిలో ముగిసింది.

ఇది కూడా చదవండి: Tragedy: విషాదం.. 6 నెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు రావడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ అత్యధికంగా నష్టపోయిగా.. పవర్ గ్రిడ్ కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభాపడ్డాయి .బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజి, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యు బ్యాంక్, మీడియా, మెటల్ 1-2 శాతం క్షీణించగా, రియల్టీ ఇండెక్స్ 1 శాతం లాభపడగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.

ఇది కూడా చదవండి: IRCTC Punya Kshetra Yatra: బంపర్ ఆఫర్.. 10 రోజుల పుణ్యక్షేత్రాల టూర్ అనౌన్స్ చేసిన ఐఆర్సిటిసి