Site icon NTV Telugu

Stock Market: మార్కెట్‌లో జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. చివరి వరకు గ్రీన్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 631 పాయింట్లు లాభపడి 76, 532 దగ్గర ముగియగా.. నిఫ్టీ 205 పాయింట్లు లాభపడి 23, 163 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.55 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ నష్టపోయాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం కనబడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ నష్టపోయాయి. ఆయా రంగాల వారీగా మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, రియాల్టీ 2 శాతం పెరిగాయి. ఆటో, బ్యాంక్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 నుంచి 1.5 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.5 శాతం తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన

Exit mobile version