దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 80, 234 దగ్గర ముగియగా.. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 24, 274 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.45 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, ఎన్‌టీపీసీ భారీ లాభాల్లో కొనసాగగా.. అపోలో హాస్పిటల్స్, టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. సెక్టార్లలో ఐటీ, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్‌లో అమ్మకాలు కనిపించగా.. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, మీడియా పేర్లలో కొనుగోలు కనిపించింది.
ఇది కూడా చదవండి: Israel-Lebanon War: కాల్పుల విరమణ నిర్ణయాన్ని స్వాగతించిన భారత్