Site icon NTV Telugu

Stock Market: ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

Stockmatket

Stockmatket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఏడాది చివరిలో ఊహించని నష్టాలను ఎదుర్కొంటోంది. గత కొద్ది రోజులుగా దేశంలో ఇండిగో సంక్షోభం నడుస్తోంది. ఇంకోవైపు అంతర్జాతీయంగా  ప్రతికూల పరిస్థితులు ఉండడంతో ఆ  ప్రభావం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ప్రస్తుతం భారీ నష్టాల్లో సూచీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుం సెన్సెక్స్ 696 పాయింట్లు నష్టపోయి 84,552 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 25,784 దగ్గర కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం

నిఫ్టీలో సిప్లా, అపోలో హాస్పటల్స్ ప్రధాన లాభాలు అర్జించగా.. ఆసియన్ పెయింట్స్, ట్రెంట్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. బీఎస్‌‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. మిగతా అన్ని రంగాలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!

 

Exit mobile version