NTV Telugu Site icon

Brian Nicol: స్టార్‌బక్స్ సీఈఓకు రూ. 948 కోట్ల ప్యాకేజీ!

Starbucks Ceo Brian Nicol

Starbucks Ceo Brian Nicol

స్టార్‌బక్స్ తన ఇన్‌కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్ కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. నికోల్‌కు $113 మిలియన్ల (రూ. 948 కోట్లు) అంచనా ప్యాకేజీని ఇవ్వబోతోంది. 50 ఏళ్ల నికోల్ యొక్క ప్యాకేజీలో $10 మిలియన్ల సైన్-ఆన్ బోనస్, $75 మిలియన్ల ఈక్విటీ గ్రాంట్ ఉన్నాయి. నికోల్ FY25 కోసం $23 మిలియన్ల వరకు అదనపు వార్షిక గ్రాంట్‌ను కూడా పొందవచ్చు. వార్షిక వేతనం 16 లక్షల డాలర్లు అని నివేదికలో పేర్కొంది. ఇది కాకుండా.. ఆయనకు $ 36 లక్షల నుంచి $ 72 లక్షల వరకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. జీతం, ప్రోత్సాహకాలు ఆయన ప్యాకేజీలో భాగమే. అయితే.. వార్షిక మంజూరు ఆ ప్యాకేజీ నుంచి వేరుగా ఉంటుంది. వారి ఆఫర్ లెటర్‌లో ప్రత్యేకమైన వసతి గురించి కూడా చర్చ ఉంది.

READ MORE: AP Rain Alert: ఏపీలో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్..!

నికోల్ స్టార్‌బక్స్ సీటెల్ ప్రధాన కార్యాలయానికి మారారు. అయితే.. అవసరమైనప్పుడు వచ్చి వెళ్లేందుకు ఆయన అంగీకరించారు.ఆయనకు వ్యక్తిగత డ్రైవర్‌తో కూడిన కారు ఇవ్వబడుతుంది. సీటెల్‌లో ఇల్లు కూడా అందజేశారు. దాని ఖర్చులను కంపెనీ బరిస్తుంది. స్టార్‌బక్స్ ప్రతినిధి ప్యాకేజీని సమర్థిస్తూ.. “బ్రియన్ నికోల్ మా పరిశ్రమలో చాలా ప్రభావవంతమైన ఉద్యోగుల్లో ఒకరిగా నిరూపించుకున్నారు. ఆయన వల్ల చాలా సంవత్సరాలుగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను సమకూరాయి. స్టార్‌బక్స్‌లో వారి పరిహారం నేరుగా కంపెనీ పనితీరు.. మా వాటాదారులందరి భాగస్వామ్య విజయంతో ముడిపడి ఉంటుంది.” అని కంపెనీ పేర్కొంది.

READ MORE:Eating Apple: యాపిల్స్ ఈ వ్యక్తులు అస్సలు తినకూడదు.. జాగ్రత్త సుమా!

17 నెలల పాటు స్టార్‌బక్స్‌కు నాయకత్వం వహించిన లక్ష్మణ్ నరసింహన్ స్థానంలో నికోల్ నియమితులయ్యారు. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 23.9% క్షీణించింది. ఫలితంగా మార్కెట్ క్యాప్ నష్టం $32 బిలియన్లకు చేరుకుంది. ఫార్చ్యూన్ ప్రకారం.. ప్రస్తుత సీఈవో చిపోటిల్ (మెక్సికన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ)లో అద్భుతంగా పనిచేశారు. ఆయన హయాంలో కంపెనీ షేరు ధర 800 శాతం పెరిగింది. ఇది కాకుండా లాభాల్లో దాదాపు 7 రెట్లు పెరిగింది. అందుకే స్టార్‌బక్స్ ఈ ప్యాకేజీపై బ్రియాన్‌ను నియమించుకుంది.