NTV Telugu Site icon

Sri Lanka: అదానీ సంస్థకు షాక్.. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న కొత్త ప్రభుత్వం

Srilanka

Srilanka

అదానీ గ్రూప్‌కు శ్రీలంక కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టులపై పున:సమీక్ష జరుపుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఆమోదించిన అదానీ గ్రూప్ పవన విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మాట్లాడుతూ.. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్యుత్ ధరలను గత ప్రభుత్వం ఆమోదించడం సమస్యగా ఉందని అన్నారు. నవంబర్ 14న పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందానికి సరికొత్త రూపాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్

అదానీ గ్రీన్ డీల్‌ను తిరిగి సమీక్షిస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే గతంలోనే ప్రతిజ్ఞ చేశారు. గత నెలలో దిసనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదానీ ప్రాజెక్ట్ ఇంధన సార్వభౌమత్వానికి ముప్పు అని దిసానాయకే పేర్కొన్నారు. దానిని రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు భారీ ప్రాజెక్టులపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోబోమని విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మంగళవారం చెప్పారు. దిసనాయకే విజయం సాధించినప్పటికీ, శ్రీలంకలోని 225 సీట్ల శాసనసభలో అతని కూటమికి కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం

శ్రీలంకలో రెండు పవన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ప్రతిపాదించింది. ఒకటి మన్నార్‌లో, రెండవది పూనేరిన్‌లో. రెండూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. మన్నార్ ప్రాజెక్ట్ వన్యప్రాణులకు ముప్పుపై పర్యావరణ సమూహాల నుంచి కోర్టు సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే కొత్త ప్రభుత్వం ఇబ్బందులు తలపెట్టే పరిస్థితి ఏర్పడడంతో అదానీ గ్రూప్‌కు పెద్ద దెబ్బ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.

ఇది కూడా చదవండి: Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్‌లో రాసుకున్న నిందితుడు