గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడిపోయాయి. చిప్‌ల కొరతతో కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గిపోయింది. సుమారు 7 లక్షల కార్లను ఇంకా డెలివరీ చేయాల్సి ఉన్నది. అయితే, చిప్‌ల కొరత వేధిస్తున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మూడు పుప్వులు ఆరు కాయలుగా సాగింది. 2020ని మించి అమ్మకాలు జరిగాయి. 2021లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 38 బిలియన్ డాలర్లను చేరుకుంది.
Read: దేశంలో భారీగా పెరిగిన సెమీకండక్టర్ల కొరత… పడిపోయిన కార్ల అమ్మకాలు…
అంటే భారత కరెన్సీలో రూ. 2,83,666 కోట్లు. 2021లో ప్రతి గంటకు 19,406 మొబైల్ ఫోన్ల అమ్మకాలు జరిగాయి. 2021 మొత్తంమీద 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్లను భారతీయులు కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో షావోమీ 24 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోగా, శాంసంగ్ 8 శాతం క్షీణతతో రెండో స్థానంలో నిలిచింది. రియల్‌మీ మూడో స్థానంలో నిలవగా, వివో, ఒప్పోలు నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. మరో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ కంపెనీ 2021లో 108 శాతం వృద్ధిని కనబరిచింది.
