Site icon NTV Telugu

Gold and Silver Prices: ఒకే రోజు రూ. 15 వేలు తగ్గిన ధర.. బంగారం, వెండి ధరలు ఇవే!

Gold

Gold

Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తు్న్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 24న) ట్రేడింగ్‌లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.15,000కి పడిపోవడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,90,000 పలుకుతోంది. కానీ, బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. అటు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 ఎగసి రూ.1,48,300 పలుకుతోంది.

అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్లతో వెండి ధరలు తరచుగా మారుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వెండి ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పొచ్చు. బంగారం వలె వెండిని కూడా తరతరాలుగా స్థిరమైన పెట్టుబడిగా పరిగణిస్తుంటారు. కాగా, గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడంతో పాటు పెళ్లి సీజన్ రావడంతో బంగారం, వెండి కొనుగోలుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.

Exit mobile version