NTV Telugu Site icon

Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ అస్థిరత మధ్య గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం రెండు సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక గురువారం ఆరంభంలోనూ అదే దూకుడు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు గట్టి ఊపునిచ్చాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ సూచీ 80,331 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 దగ్గర ట్రేడ్ అయింది. ఒక దశలో 24,372 దగ్గర రికార్డు స్థాయిని అందుకుంది. అనంతరం సూచీలు నెమ్మది నెమ్మదిగా డౌన్ అయిపోయాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 62 పాయింట్లు లాభపడి 80, 049 దగ్గర ముగియగా.. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 24, 302 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.54 దగ్గర ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: Adluri Laxman: కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచింది

ఇక ఐటీ రంగం వెలిగిపోయింది. నిఫ్టీలో అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ లాభపడగా.. టాప్ లూజర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌ నియామకం