Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్‌లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex Crash: శుక్రవారం మధ్యాహ్నం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:33 గంటల సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు నష్టపోయి 76,653 వద్ద ఉండగా, నిఫ్టీ 283 పాయింట్లు క్షీణించి 23,890 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు $106 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధాన ఐటీ సంస్థలు బలహీనమైన గైడెన్స్‌ను ప్రకటించడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పతనమై మార్కెట్‌ను భారీగా దెబ్బతీసింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIలు) వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే రూ.3,200 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ (India VIX) 4 శాతం పెరిగి 19.3 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనం.
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
లాభనష్టాల్లోని షేర్లు..
ఈ రోజు మార్కెట్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 6 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎం అండ్ ఎం షేర్లు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా నామమాత్రపు మద్దతును అందించింది. మార్కెట్లో విక్రయాల ఒత్తిడి ఎంత బలంగా ఉందంటే.. దాదాపు 2,752 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కేవలం 965 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి 23,800 స్థాయి వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా మూడు సెషన్లలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా, అంటే 3% పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 2.6% క్షీణించింది. ఏప్రిల్ 21న బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్లుగా ఉండగా, మూడు రోజుల్లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?