NTV Telugu Site icon

Stock market: మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్‌లు సృష్టించిన సూచీలు

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమం క్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కౌంటర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ 391 పాయింట్లు లాభపడి 80, 351 దగ్గర ముగియగా.. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 24, 433 దగ్గర ముగిసింది. డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ. 83.49 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

నిఫ్టీలో మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, ఐటీసీ, సన్ ఫార్మా మరియు దివీస్ ల్యాబ్స్ టాప్ గేర్‌లో దూసుకుపోగా… ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ మరియు బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సొంత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..