స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాన సూచీల్లో ఒకటైన సెన్సెక్స్ 60 వేల పాయింట్లను దాటి కొత్త చరిత్రను లిఖించింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్లుగా నిలిచిన భారత స్టాక్ మార్కెట్లు.. త్వరలోనే ఐదో స్థానానికీ ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పసమయం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. సెన్సెక్స్ చివరికి 163 పాయింట్లు లాభపడి 60 వేల 48 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం దాదాపు ఇదే దూకుడును ప్రదర్శించింది. 18,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంటుందని భావించినప్పటికీ.. గరిష్ఠాల వద్ద నిరోధం ఎదురుకావడంతో పైకి ఎగబాకలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిమాణాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న 50 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. కేవలం 7 నెలల్లో 60 వేలకు చేరుకొని అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడుతున్నాయి.
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!