Site icon NTV Telugu

స్టాక్‌ మార్కెట్ల సరికొత్త రికార్డు

దేశీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాన సూచీల్లో ఒకటైన సెన్సెక్స్ 60 వేల పాయింట్లను దాటి కొత్త చరిత్రను లిఖించింది. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్లుగా నిలిచిన భారత స్టాక్‌ మార్కెట్లు.. త్వరలోనే ఐదో స్థానానికీ ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌.. రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పసమయం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్‌ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. సెన్సెక్స్‌ చివరికి 163 పాయింట్లు లాభపడి 60 వేల 48 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం దాదాపు ఇదే దూకుడును ప్రదర్శించింది. 18,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంటుందని భావించినప్పటికీ.. గరిష్ఠాల వద్ద నిరోధం ఎదురుకావడంతో పైకి ఎగబాకలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిమాణాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న 50 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. కేవలం 7 నెలల్లో 60 వేలకు చేరుకొని అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతున్నాయి.

Exit mobile version