Site icon NTV Telugu

Home Loans: హోం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌..

Sbi

Sbi

కరోనా తర్వాత భారీగా తగ్గిన గృహ రుణాలపై వడ్డీ రేట్లు.. కొంత గ్యాప్‌ తర్వాత క్రమంగా మళ్లీ పెరిగిపోతున్నాయి.. అయితే, ఇప్పుడు హోంలోన్‌ తీసుకుంటే మాత్రం భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది.. తన వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది.. ఈ నెల 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌.. 2023 జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది ఎస్బీఐ.. అయితే, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.05 శాతంగా ఉండగా… ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్‌లో డిస్కౌంట్‌ తీసుకొచ్చింది ఎస్బీఐ.. వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 వరకూ తగ్గించింది. దీంతో, ఈ సమయంలో హోం లోన్‌ తీసుకునేవారు 8.40 శాతం నుంచి 9.05 శాతం వరకు వడ్డీ రేటు వర్తించనుంది..

Read Also: First Flex-Fuel Car: కొత్త కారు ఆవిష్కరించిన నితిన్‌ గ‌డ్కరీ.. ఇక, పెట్రో కష్టాలకు చెక్‌..!

అయితే, ఆ వడ్డీ రేటు.. సంబంధిత కస్టమర్‌ యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా 8.40 శాతం నుంచి 9.05 శాతం మధ్య ఉంటుంది.. అంటే, సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే.. అంత తక్కువ వడ్డీకే హోం లోన్‌ అందించనుంది ఎస్బీఐ.. సిబిల్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే..8.40 వడ్డీతో రుణం ఇస్తామని.. ఇది 8.55 సాధారణ వడ్డీతో పోలిస్తే 0.15 శాతం తక్కువని పేర్కొంది ఎస్బీఐ.. మరోవైపు.. సిబిల్ స్కోర్ 750 నుంచి 799 ఉంటే వడ్డీ రేటు 8.65 శాతం నుంచి 8.40 శాతానికి చేరనుంది.. అదే, సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే..0.20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ఎస్బీఐ చెబుతోంది.. సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువ ఉంటే మాత్రం ఎస్బీఐ చెబుతున్న ఏ విధమైన డిస్కౌంట్ ఆఫర్‌ వర్తించబోదు. అయితే, గృహ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇది గుడ్‌న్యూసే.. ఆలస్యం చేస్తే మాత్రం.. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోయి.. మళ్లీ సాధారణ వడ్డీ రేటుకే లోన్‌ తీసుకోవాల్సి వస్తుంది.

Exit mobile version