కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. పెంచిన కొత్త ఛార్జీలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది.
ఇది కూడా చదవండి: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర
ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పెరిగిన కొత్త ఛార్జీలు పొందిపరిచింది. క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ.200 చేసింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తోంది. దీన్ని రూ.425కు సవరించింది. కొత్త ఛార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనంగా ఉంటుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Siddarth : సిద్దార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా..? ఆ కారణం వల్ల విడిపోయారా?
వివరాలు ఇలా..
1. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లతో సహా డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఇలా మారనుంది. రూ.125 నుంచి రూ.200కు పెరిగింది. జీఎస్టీ అదనం.
2. యువా, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డ్‌లు కూడా వార్షిక మెయింటెనెన్స్‌లో ఇలా పెరిగింది. రూ.175 నుంచి రూ.250కు పెరిగింది. జీఎస్టీ అదనం.
3. SBI ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రూ.250 నుంచి రూ.325కు పెరిగింది. జీఎస్టీ అదనం.
4. ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ వంటి SBI డెబిట్ కార్డ్‌లకు వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగింది. జీఎస్టీ అదనం.