SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Rules Change: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని ఖాతాలకు సంబంధించిన ATM, ADWM లావాదేవీల ఉచిత పరిమితుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా Salary Package ఖాతాదారులు ఇతర బ్యాంకుల ATMలు, ADWMలను ఉపయోగించే సమయంలో ఈ మార్పును గమనించాలి. SBI అధికారికంగా ఈ మార్పును ప్రకటించింది.
BSBD ఖాతాలకు నాలుగు ఉచిత నగదు ఉపసంహరణలు
Basic Savings Bank Deposit (BSBD) ఖాతాల విషయంలో నెలకు నాలుగు నగదు ఉపసంహరణలు ఉచితంగా కొనసాగుతాయి. ఈ నాలుగు ఉపసంహరణలు పూర్తయిన తర్వాత చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.15తో పాటు GST ఛార్జీ వర్తిస్తుంది. SBI నిబంధనల ప్రకారం ఈ ఉచిత నాలుగు ఉపసంహరణల్లో ATMతో పాటు ఇతర నిర్దిష్ట నగదు ఉపసంహరణ మార్గాలు కూడా పరిగణనలోకి వస్తాయి. అంటే నెలలో నాలుగు నగదు ఉపసంహరణలు చేసిన తర్వాత ఐదో ఉపసంహరణ నుంచి ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా నగదు తీసుకునే BSBD ఖాతాదారులు తమ నెలవారీ లావాదేవీలను గమనించడం అవసరం.
Also Read
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
Salary Account ఖాతాదారులకు కీలక మార్పు
అక్టోబర్ 1వ తేదీ నుంచి SBI Salary Package ఖాతాదారులు ఇతర బ్యాంకుల ATMలు, Automated Deposit and Withdrawal Machines (ADWM) వద్ద నెలకు గరిష్ఠంగా 5 ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోగలరు. ఇప్పటివరకు ఈ పరిమితి 10గా ఉంది. ఈ ఐదు ఉచిత లావాదేవీల్లో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండూ కలుస్తాయి. అంటే నగదు ఉపసంహరణతో పాటు ATMలో బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉచిత పరిమితిలో లెక్కించబడతాయి.
ఐదు లావాదేవీలు దాటితే ఎంత ఛార్జీ?
ఉచిత ఐదు లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ATM/ADWMలో నగదు ఉపసంహరణకు ఒక్కో లావాదేవీపై రూ.23 + GST ఛార్జీ వర్తిస్తుంది. ఆర్థికేతర లావాదేవీలకు రూ.11 + GST ఛార్జీ ఉంటుంది. ఈ ఛార్జీలు SBI ఇప్పటికే అమల్లోకి తెచ్చిన ATM/ADWM సేవా ఛార్జీల నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ మార్పు ప్రధానంగా Salary Package ఖాతాదారులు ఇతర బ్యాంకుల ATMలు, ADWMలను ఉపయోగించే లావాదేవీలకు సంబంధించినది. SBI ATMల విషయంలో వర్తించే ఉచిత లావాదేవీలు ఖాతా రకం, సంబంధిత నిబంధనల ఆధారంగా ఉంటాయి. అందువల్ల కస్టమర్లు తమ ఖాతా రకాన్ని బట్టి ఛార్జీలను పరిశీలించాలి. మొత్తంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి Salary Package ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ATM/ADWMల వద్ద ఉచిత లావాదేవీల పరిమితి 10 నుంచి 5కు తగ్గనుండటంతో, తరచుగా ATMలను ఉపయోగించే వారు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?