SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
- SBI ఖాతాదారులకు షాక్
- అక్టోబర్ 1 నుంచి ATM ఉచిత లావాదేవీలు సగానికి తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Rules 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన అప్డేట్. ముఖ్యంగా SBI Salary Package Account కలిగిన వారికి ATM లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో మార్పు రానుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల ATMలు, ADWMలలో SBI డెబిట్ కార్డుతో చేసే ఉచిత నెలవారీ లావాదేవీల పరిమితిని తగ్గించనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే ఖాతాదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే SBI ATMల విషయంలో Salary Package Account ఖాతాదారులకు ప్రత్యేక ప్రయోజనం కొనసాగుతుంది.
అక్టోబర్ 1 నుంచి ఏం మారుతుంది?
ప్రస్తుతం SBI Salary Package Account ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ATMలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని నెలకు 5 లావాదేవీలకు తగ్గించనున్నారు. ఈ 5 లావాదేవీల్లో నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు రెండూ కలిపి ఉంటాయి. అంటే నెలలో ఇతర బ్యాంకుల ATMలు/ADWMల వద్ద మొత్తం 5 ఉచిత లావాదేవీలను ఉపయోగించిన తర్వాత చేసే అదనపు లావాదేవీలపై ఛార్జీలు వర్తిస్తాయి.
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
ఉచిత పరిమితి దాటితే ఎంత ఛార్జ్?
ఉచిత ATM లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నగదు ఉపసంహరణ.. ప్రతి లావాదేవీకి రూ.23 + GST, ఆర్థికేతర లావాదేవీ.. ప్రతి లావాదేవీకి రూ.11 + GST కాబట్టి ఇతర బ్యాంకుల ATMలను తరచుగా ఉపయోగించే SBI Salary Package ఖాతాదారులు తమ నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని గమనించడం అవసరం.
సాధారణ SBI సేవింగ్స్ ఖాతాదారులకు మార్పు ఉందా?
మీకు SBI Salary Package Account లేకుండా సాధారణ Savings Account లేదా ఇతర SBI ఖాతా ఉంటే, మీరు ఇప్పటికే వర్తిస్తున్న ATM ఉచిత లావాదేవీల నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. ఇతర బ్యాంకుల ATMలు/ADWMలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండూ కలిపి ఉంటాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.23 + GST, ఆర్థికేతర లావాదేవీకి రూ.11 + GST ఛార్జీలు వర్తిస్తాయి.
SBI ATMల్లో Salary Package ఖాతాదారులకు మాత్రం గుడ్ న్యూస్
ఇతర బ్యాంకుల ATMలలో ఉచిత లావాదేవీల పరిమితి ఉన్నప్పటికీ, SBI Salary Package ఖాతాదారులకు SBI ATMల విషయంలో ప్రత్యేక ప్రయోజనం ఉంది. అన్ని Salary Package Accounts ఖాతా రకంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న SBI ATMలలో అపరిమిత ఉచిత లావాదేవీలకు అర్హత కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ఇందులో Shaurya Family Pension Account, Family Savings Account – SBI Rishte వంటి ఖాతాలు కూడా ఉన్నాయి. అంటే SBI Salary Package ఖాతాదారులు SBI ATMలను ఉపయోగించినప్పుడు ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని పొందవచ్చు.
SBI ఖాతాదారులు ఏం గుర్తుంచుకోవాలి?
అక్టోబర్ 1 నుంచి ఇతర బ్యాంకుల ATMలను ఎక్కువగా ఉపయోగించే Salary Package ఖాతాదారులు తమ ఉచిత లావాదేవీల సంఖ్యను గమనించాలి. అవసరం లేకుండా పదేపదే బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటి ATM లావాదేవీలు చేయకుండా ఉంటే అదనపు ఛార్జీలను తగ్గించుకోవచ్చు. ATM ఛార్జీలు, ఉచిత లావాదేవీల పరిమితులు ఖాతా రకం, ATM రకం, లావాదేవీ రకం తదితర అంశాలపై ఆధారపడవచ్చు. కాబట్టి మీ ఖాతాకు వర్తించే తాజా ఛార్జీలను SBI అధికారిక నిబంధనల్లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
-
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!