Recykal: సచిన్ టెండూల్కర్ సరికొత్త ఇన్నింగ్స్.. క్లీన్ ఇండియా కోసం మాస్టర్ బ్లాస్టర్ బిగ్ స్టెప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recykal: క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇప్పుడు క్లీన్ ఇండియా కోసం మరో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్ కంపెనీ ‘రీసైకల్’లో సచిన్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా చేరారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చి, చెత్త నిర్వహణను ప్రతి ఒక్కరి రోజువారీ అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో సచిన్ ఈ కీలక అడుగు వేశారు. ఇటీవల రీసైకల్ ప్రకటించిన 23 మిలియన్ డాలర్ల బ్రిడ్జ్ రౌండ్‌కు సచిన్ పెట్టుబడి మరింత బలాన్ని ఇచ్చింది.
దేశంలో పేరుకుపోతున్న చెత్త సమస్యను కేవలం టెక్నాలజీతోనే కాకుండా, జనం అలవాట్లు మార్చడం ద్వారా పరిష్కరించవచ్చని సచిన్, రీసైకిల్ను బలంగా నమ్ముతున్నారు. చెత్తను పనికిరాని వస్తువులా బయట పడేయకుండా, దానిని రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే ఈ పార్ట్నర్షిప్ మెయిన్ టార్గెట్‌గా చెప్పారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. “నా కెరీర్ మొత్తంలో విజయం అనేది క్రమశిక్షణ, నిరంతర కృషిపైనే ఆధారపడి ఉంటుందని నేర్చుకున్నాను. పరిశుభ్రమైన భారత్‌ను నిర్మించడానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రోజువారీ చెత్త సమస్యను పరిష్కరించడానికి రీసైకల్ టెక్నాలజీని వాడుతున్న తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. వంద కోట్ల మంది ప్రవర్తనలో మార్పు తేవాలనే వీరి లక్ష్యం నాకు నిజంగా నచ్చింది” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
- India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
- RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
2015లో హైదరాబాద్ కేంద్రంగా మొదలైన రీసైకల్, డిపాజిట్ రిటర్న్ సిస్టమ్స్ (DRS), ఏఐ (AI) ఆధారిత రివర్స్ వెండింగ్ మెషీన్ల ద్వారా రీసైక్లింగ్ రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. సచిన్ రాకపై కంపెనీ సీఈఓ, కో-ఫౌండర్ అభయ్ దేశ్‌పాండే స్పందిస్తూ.. “ఎన్నో ఏళ్లుగా తన క్రమశిక్షణ, నిజాయితీతో భారతీయులందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన సచిన్ మాతో చేరడం చాలా ఆనందంగా ఉంది. పర్యావరణానికి మేలు చేయడాన్ని అందరికీ ఒక అలవాటుగా మార్చే ఉద్యమానికి ఆయన పెద్ద స్ఫూర్తిగా నిలుస్తారు” అన్నారు. ఇప్పటికే హిందుస్థాన్ యూనిలీవర్, శాంసంగ్, BMW లాంటి 650కి పైగా పెద్ద బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్న రీసైకల్, 30 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను రీసైకిల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.
తాజావార్తలు
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!