Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు క్లాసిక్ లుక్, ఆధునిక టెక్నాలజీ కలయికతో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బరువైన ఇంజన్ శబ్దం గుర్తుకువస్తుంది, కానీ ఈ కొత్త బైక్ నిశ్శబ్దంగా.. పర్యావరణానికి మేలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ బరువు, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా సిటీలో ప్రయాణించే వారిని ఆకట్టుకునేలా రూపొందించబడింది.
ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే.. ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS) పద్ధతిలో తీసుకుంటే దీని ధర రూ. 1.99 లక్షలకే లభిస్తుంది. ఇందులో 3.91 kWh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీ 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Also Read:Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..
ఫ్లయింగ్ ఫ్లీ C6 కేవలం 3.7 సెకన్లలోనే 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. ఇందులో గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్, ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్, ప్రమాదాల నుంచి రక్షించే అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉన్నాయి. రైడర్ తన ఇష్టానుసారం వేగాన్ని మార్చుకోవడానికి వివిధ రకాల ‘రైడ్ మోడ్స్’ కూడా ఇందులో ఉన్నాయి.
తేలికపాటి డిజైన్..
ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే దీని బరువు. కేవలం 124 కిలోల బరువుతో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ చరిత్రలోనే అత్యంత తేలికైన బైక్‌గా ఇది నిలిచింది. దీని సీటు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది. ఇది బైక్‌కు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అల్యూమినియం బాడీతో తయారైన ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సిటీ రోడ్లపై హాయిగా, సులభంగా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
తాజావార్తలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!