పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా మెరుపులు మెరిసిన బంగారం ధరలు దీపావళి రోజున కాస్త ఉపశమనం కలిగించింది. గోల్డ్, సిల్వర్ ధరలు నెమ్మదించాయి. తులం బంగారం ధరపై రూ. 170 తగ్గింది. సిల్వర్ ధర మాత్రం యధాస్థితిలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 170 తగ్గి రూ.1, 30, 690 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 150 తగ్గి రూ.1, 19, 800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 20 తగ్గి రూ.98, 020 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
మరోవైపు వెండి ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 90, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతుండగా.. బెంగళూరులో మాత్రం 1, 79, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
