భారత్‌లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ఒక్కొక్కటిగా తమ 5జీ సర్వీలను ప్రారంభిస్తున్నాయి టెలికం సంస్థలు.. భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ కోట్లాది మంది అభిమాన్ని చురగొని అతిపెద్ద టెలికం సంస్థగా అవిర్భవించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు.. 5జీలోనూ దూకుడు చూపిస్తోంది.. విజయదశమిని పురస్కరించుకుని 5జీ సర్వీస్‌లను మొదలుపెట్టింది జియో.. అయితే, ప్రస్తుతానికి దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అంతేకాదు.. వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది జియో.. అన్నీ ఉచితమంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ సంస్థ.. అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ తో ఒక సరికొత్త రికార్డులను సృష్టించింది.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది జియో… ప్రస్తుతానికి నాలుగు సిటీల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో లాంచ్ చేసింది.
Read Also: Astrology : అక్టోబర్ 06, గురువారం దినఫలాలు
ప్రస్తుతం 5జీ బీటా సర్వీస్‌లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో అందుబాటులోకి తీసుకొచ్చింది జియో.. విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి రోజున 5జీ సర్వీస్‌లను ప్రారంభించింది.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 5జీ సేవలు పొందాలంటే.. 5జీకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు జియో యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.. అంటే.. ఇప్పటికే వాడుతోన్న జియో సిమ్.. 5జీకి కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట.. కానీ.. 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉండాలని చెబుతున్నారు. ఆ నాలుగు సిటీల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు వెల్‌కమ్ ఆఫర్‌ను ఇస్తోంది జియో… కస్టమర్లకు మెసేజ్ ద్వారా ఆహ్వానం పంపి ఈ ఆఫర్‌ను అందిస్తోంది.. అలా వారు మాత్రమే ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకునే వీలు ఉంటుంది..
అయితే, రిలయన్స్ జియో 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నారు విశ్లేషకులు.. కంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో చెబుతోంది.. దేశంలోని 8 నగరాల్లో 5జీ సర్వీస్‌లను తొలి దశలో తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్రకటించగా.. ఇప్పుడు జియో నాలుగు నగరాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించింది.. “జియో యొక్క ట్రూ-5G “వి కేర్” సూత్రంపై నిర్మించబడింది.. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, చిన్న, మధ్యతరహా మరియు పెద్ద సంస్థలు, స్మార్ట్ హోమ్‌లు, గేమింగ్‌లో 1.4 బిలియన్ల భారతీయులను ప్రభావితం చేసే పరివర్తన మార్పులను తీసుకువస్తుంది అని ఆ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.. ఇతర నగరాలు 5జీ టెక్నాలజీకి సిద్ధమవుతున్నందున బీటా ట్రయల్ సేవను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. ప్రతి కస్టమర్‌కు ఉత్తమ కవరేజీ మరియు వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ఒక నగరం యొక్క నెట్‌వర్క్ కవరేజ్ పూర్తయ్యే వరకు ఆహ్వానించబడిన వినియోగదారులు బీటా ట్రయల్ సేవలను పొందడం కొనసాగిస్తారు.