Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో రిలయన్స్ జియో ఐపీఓ సరికొత్త రికార్డులను తిరగరాసింది. భారత ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి చాటిచెబుతూ జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే ఇప్పటివరకు ఏ సంస్థ అందుకోని రీతిలో కోటికి పైగా దరఖాస్తులను రాబట్టి గ్లోబల్ స్థాయిలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
గతంలో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న 97 లక్షల దరఖాస్తుల రికార్డును జియో సునాయాసంగా క్రాస్ చేసింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బీసీసీఎల్ వంటి భారీ ఐపీఓలకు వచ్చిన 90 లక్షల దరఖాస్తుల మార్కును దాటేసి అగ్రస్థానంలో నిలిచింది. ముగింపు రోజైన అక్టోబర్ 23 నాటికి అన్ని కేటగిరీల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. 19.75 కోట్ల షేర్ల అమ్మకానికి రాగా, మధ్యాహ్నం సమయానికే దాదాపు 148 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఐపీఓ ఏకంగా 7.49 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది.
Also Read
- Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
- Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
- Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
ముఖ్యంగా సంస్థాగత కొనుగోలుదారులు (QIB) ఈ ఐపీఓపై భారీగా ఎగబడ్డారు. కేటాయించిన కోటా కంటే 16.06 రెట్ల మేర బిడ్లు వేసి తమ ఆసక్తిని చాటారు. సంపన్న వర్గాల (NII) కేటగిరీ 10.14 రెట్లు, సాధారణ రిటైల్ విభాగం 2.10 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రూ.30,213 కోట్ల భారీ పరిమాణంతో వచ్చిన ఈ ఐపీఓ, ఇటీవల వచ్చిన హ్యుందాయ్ మోటార్స్ (రూ.27,859 కోట్లు) పబ్లిక్ ఇష్యూను వెనక్కి నెట్టి దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరించింది.
ప్రస్తుతం గ్రే మార్కెట్లోనూ జియో షేర్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. రూ.1,065 నుంచి రూ.1,119 ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణయించగా, గ్రే మార్కెట్లో ఒక్కో షేరుపై దాదాపు 22 శాతానికి పైగా ప్రీమియం పలుకుతోంది. షేర్ల కేటాయింపు అక్టోబర్ 26న ఖరారు కానుండగా, అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా లిస్టింగ్ కోసం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!